- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ రైతులకు భారీగా నష్టం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ ఏపీ ఆక్వారంగం పై భారీగా పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయా దేశాలకు ప్రతి రోజూ రొయ్యలు, చేపలు ఎగుమతి అవుతుంటాయి...

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య యుద్ధం(War) జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎఫెక్ట్ ఏపీ ఆక్వారంగం(AP Aquaculture)పై భారీగా పడింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుంచి ఆయా దేశాలకు ప్రతి రోజూ రొయ్యలు(Frans), చేపలు(Fishes) ఎగుమతి అవుతుంటాయి. అయితే ఈ వార్ దెబ్బకు పాలిమర్ కొరత ఏర్పడింది. దీంతో ధర్మకోల్, ప్యాకింగ్ ధరలు పెరిగాయి. అయితే ప్యాకర్స్, ఎక్స్ పోర్టర్స్ఈ భారాన్ని రైతులపై మోపుతున్నారు. రైతుల నుంచి కేజీకి రూ.10 తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచి రోజుకు 500 లారీలు ఎగుమతి అవుతుంటాయని, కేజీకి రూ.10 తగ్గించి కొనుగోలు చేయడంతో ప్రతి రోజు రూ. 75 లక్షల మేర తమకు నష్టం వాటిల్లుతోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ పోర్టర్లు, సీడ్ కంపెనీలు సిండికేట్‌గా మారి తమకు నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాము కొన్ని కంపెనీల ఉత్పత్తులపై నిషేధం విధిస్తామని ఆక్వా రైతులు హెచ్చరించారు.
అయితే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, కానీ ఎలాంటి న్యాయం జరగడంలేదని తెలిపారు. ప్రభుత్వం, రైతుల మధ్య గ్యాప్ ఉందని, అప్సడ మీటింగ్‌లోనూ తమ సమస్యలను చెప్పుకున్నామని తెలిపారు






