తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-24 02:35:43  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.

ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో 09 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(బుధవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 68,705 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,382 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.62 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.

Next Story