Srisailam Dam:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. ఆరోసారి గేట్లు ఎత్తివేత

by Jakkula.Mamatha |   (  Updated:2024-10-24 09:58:28  IST  )

కృష్ణానదిలో వరద ప్రవాహం(flood flow) కొనసాగుతోంది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలకు జలకళ సంతరించుకుంది.

Srisailam Dam:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. ఆరోసారి గేట్లు ఎత్తివేత
X

దిశ,వెబ్‌డెస్క్: కృష్ణానదిలో వరద ప్రవాహం(flood flow) కొనసాగుతోంది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలకు జలకళ సంతరించుకుంది. శ్రీశైలం జలాశయాని(Srisailam reservoir)కి వరద ఉధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అధికారులు శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి.. దిగువన నాగార్జున సాగర్‌(Nagarjuna Sagar)కు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో మరోసారి శ్రీశైలం జలాశయం(Srisailam reservoir) గేట్లు ఎత్తారు. శ్రీశైలం డ్యామ్(Srisailam Dam) ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో రూపంలో 1,96,177 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఒక గేటు ద్వారా జల విద్యుత్ కేంద్రాల నుంచి మొత్తంగా ఔట్ ఫ్లో రూపంలో 95,802 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. శ్రీశైలం డ్యామ్(Srisailam Dam)పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 884.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీ(TMC)లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 215.3263 టీఎంసీ(TMC)లుగా ఉంది. ఇక కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంతో పాటు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.

Next Story