అరకు లోయలో దారుణం.. నాటు తుపాకీతో కాల్పులు

by Vemula.Srinu Prasad |

అల్లూరి జిల్లా అరకు లోయలో భూమి కోసం సాగుతున్న గొడవలు చివరకు ప్రాణాల మీదకు తెచ్చాయి. డూమ్రీగూడ మండలం పోతంగి పంచాయతీలో బంధువుల మధ్య ఉన్న పాత భూతగాదాలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి

అరకు లోయలో దారుణం.. నాటు తుపాకీతో కాల్పులు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లా(Alluri District) అరకు లోయలో(ArakuLoya) భూమి కోసం సాగుతున్న గొడవలు చివరకు ప్రాణాల మీదకు తెచ్చాయి. డూమ్రీగూడ మండలం పోతంగి పంచాయతీ(Potangi Panchayat)లో బంధువుల మధ్య ఉన్న పాత భూతగాదాలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. మాట మాట పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన లక్ష్మణరావు అనే వ్యక్తి, తన బంధువైన కిల్లోబి మల్లుపై నాటు తుపాకీ(Gun)తో కాల్పులు జరిపాడు. ప్రశాంతంగా ఉండే మన్యం ప్రాంతంలో ఈ తుపాకీ మోత ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

ఈ కాల్పుల్లో కిల్లోబి మల్లు శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లును గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూమి కోసం కన్నవారిని, బంధువులను కూడా లెక్కచేయకుండా ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేగింది.

Next Story