Ap News: లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-05 06:00:20  IST  )

ఏపీలో ఇటీవల కాలంలో లోన్ యాప్ వేధింపులకు బలి అవుతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది..

Ap News: లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఇటీవల కాలంలో లోన్ యాప్(Loan App) వేధింపులకు బలి అవుతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. అవసరాల నిమిత్తం డబ్బులు లోన్ తీసుకోవడం, భారీ వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మరణాలు ఈ మధ్యన మరింత పెరిగాయి. తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన యువకుడు శ్రీకాంత్ లోన్ యాప్ ద్వారా డబ్బులు లోన్ తీసుకున్నారు. ఇంతకాలం సక్రమంగానే ఈఎంఐలు కట్టుకుంటూ వచ్చారు. అయితే ఒక నెల ఆలస్యం కావడంతో లోన్‌యాప్ నిర్వాహకులు వేధించడం మొదలు పెట్టారు. ప్రతి గంటకో సారి ఫోన్ చేసి డబ్బులు కడతావా లేదా అని బెదిరింపులకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన శ్రీకాంత్ పురుగుమందు(Pesticide) తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులు లోన్‌యాప్‌లను నిషేధించాలని, వాటి ద్వారా డబ్బులు లోన్ తీసుకోవద్దని తెలిపారు. ఏదైనా సమస్యలుంటే తమను సంప్రదించాలని, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని, కానీ ఆత్మహత్యలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story