- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Posani: పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మరో రెండు కేసులు నమోదు
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 30కి పైగా ఫిర్యాదులు అందగా 17 కేసులు నమోదు అయిన పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా పోసానికి బిగ్ షాక్ తగిలింది. పోలీసులు మరో రెండు కేసులు(Two More Cases) నమోదు చేశారు. చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan), లోకేశ్(Lokesh)పై అభ్యకర వ్యాఖ్యలు, కులాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని యాదమర్రి, పుత్తూరు పీఎస్‌ల్లోనూ ఆయనపై ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేశారు.
కాగా అన్నమయ్య జిల్లాల సంబేపల్లిలో నమోదైన కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజంపేట సబ్ జైలులో ఉన్న ఆయననను పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి నరసనరావుపేటలో నమోదు అయిన కేసుకు సంబంధించిన కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున కడప మొబైల్ కోర్టులో వాదనలు వినిపించారు. కస్టడీకి ఇవ్వాలని అటు పోలుసులు కోరారు. దీంతో రెండు పిటిషన్లపై విచారణను 5కు వాయిదా వేసింది.






