సిరాజ్ మొదటి టార్గెట్ అదే.. కీలక వివరాలు రాబట్టిన ఎన్ఐఏ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-27 00:34:01  IST  )

విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితుల ఎన్ఐఏ కస్టడీ కొనసాగుతోంది....Andhra Pradesh, Telugu News, Latest News, NIA Custody, Vizianagaram Blasts Case

సిరాజ్ మొదటి టార్గెట్ అదే.. కీలక వివరాలు రాబట్టిన ఎన్ఐఏ
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు(Vizianagaram blasts conspiracy case)లో నిందితులు సిరాజ్(Siraj), సమీర్(Sameer) ఎన్ఐఏ కస్టడీ(NIA Custody) కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన ఎన్ఐఏ అధికారులు నిందితుడు సిరాజ్ నుంచి కీలక వివరాలు రాబట్టారు. ప్రశాంతంగా ఉన్న విజయనగరమే తన తొలి టార్గెట్ అని సిరాజ్ తెలిపినట్లు విచారణలో తేలింది.

హైదరాబాద్‌లో పేలుళ్ల జరపాలని సౌదీ హ్యాండర్లు సూచించినప్పటికీ విజయనగరమే ఫస్ట్ అని చెప్పినట్లు విచారణలో సిరాజ్ స్పష్టం చేశారు. అంతేకాదు పేలుళ్లు జరిపేందుకు పాకిస్థాన్‌(Pakistan)తో పాటు సౌదీ(Soudi)లో శిక్షణ తీసుకున్న అధికారులకు సిరాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. విజయనగరంలో పేలుళ్లు జరిపేందుకు నాలుగు ప్రాంతాలను సైతం ఎంపిక చేసుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో సిరిజ్ వెల్లడించినట్లు సమాచారం. నాలుగు రోజుల పాటు జరిగిన విచారణలో అధికారులు చాలా సంచలన విషయాలను గుర్తించారు. ఈ రోజు ఐదు రోజు కూడా సిరాజ్, సమీర్ కస్టడీ కొనసాగనుంది. విజయగనరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలోనే వీరిద్దరిని ఉంచిన ఎన్ఐఏ అధికారులు సోమవారం విచారణలో ఎలాంటి సమాచారాన్ని రాబడతారో చూడాలి.

Next Story