- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు: ఆ రెండు పథకాల్లో తేడా ఇదే..!
ఎన్డీయే కూటమి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోంది....

దిశ, వెబ్ డెస్క్: ఎన్డీయే కూటమి(NDA Alliance) సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోంది. పేదరికం నిర్మూలన కోసం ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’(Talliki Vandanam) పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అధికారులు జీవో విడుదల చేశారు. అయితే తల్లికి వందనంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూటమి నాయకులు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు విద్యార్థుల కోసం తాము ఏం చేసేమో, గత ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా విడుదల చేశారు.
తల్లికి వందనం, అమ్మఒడి(Ammavadi) మధ్య తేడాలు వివరించారు. తల్లికి వందనం 67 లక్షల 27 వేల 164 మందికి ఏడాదికి రూ.10. 091 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. అలాగే గత ప్రభుత్వం అమ్మఒడిని 42 వేల 61 లక్షల 965 మంది విద్యార్థులకి అందజేసిందని, ఇందుకు మొత్తం రూ.5,540 కోట్లు విడుదల చేసిందని తెలిపారు జగన్ ప్రభుత్వంలో కంటే తమ సర్కార్ 24,65,199 మంది ఎక్కువ విద్యార్థులకు తల్లివందనం అందజేసిందని, అలాగే రూ.4,551 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించి కేటాయింపుల పట్టికను విడుదల చేశారు. అలాగే వివిధ పథకాలకు సంబంధించిన లెక్కలు, వివరాలు కూడా పొందుపర్చారు.






