- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్
విశాఖ బీచ్ (Vizag Beach) మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికైంది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి.. క్రీడా స్ఫూర్తిని రగిలించడానికి.. భారీ మారథాన్ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: విశాఖ బీచ్ (Vizag Beach) మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికైంది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి.. క్రీడా స్ఫూర్తిని రగిలించడానికి.. భారీ మారథాన్ జరిగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ మారథాన్ కు హాజరయ్యారు. వేలాది మందిగా తరలివచ్చి మారథాన్ లో పాల్గొన్నారు. భారతీయ నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 2025 ను (Vizag Navy Marathon 2025) తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి సంజయ్ భల్ల ప్రారంభించారు. మారథాన్ కు విశాఖపట్నం జిల్లా కలెక్టరుతో పాటు, నగర పోలీసు కమిషనర్ హాజరయ్యారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 18వేల మందికి పైగా హాజరయ్యారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు మారథాన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మారథాన్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు
భారీ ఎత్తున ప్రజలు, ఔత్సాహికులు, రన్నర్లు, ప్రముఖులు వైజాగ్ నేవీ మారథాన్ కు హాజరయ్యారు. వేలాది మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలను తీసుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. బీచ్ రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలను వేరే దారుల్లో మళ్లిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని అధికారులు చెబుతున్నారు.
రన్నర్స్ కోసం వేదికగా
వైజాగ్ నేవీ మారథాన్ ను రన్నర్స్ కు ఒక వేదికగా కావాలని కోరుతూ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. సమాజహితం కోసం చేపట్టిన కార్యక్రమంలో వారిని కూడా భాగస్వాములను చేస్తున్నాం అన్నారు. ఇందులో అంతర్జాతీయ రన్నర్లు కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. తద్వారా మారథాన్ లో పాల్గొన్న వారికి క్రీడా స్ఫూర్తిని, జాతీయ ఐక్యతను సాధించేందుకు ప్రోత్సహాన్ని ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా ఫిట్నెన్ వేడుకగా కూడా వైజాగ్ మారథాన్ 2025 నిలుస్తుందన్నారు. విశాఖ బీచ్ అందాలు అదనపు ఆకర్షణగా మారాయని వెల్లడించారు.






