- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి పేర్నినానికి బిగ్ షాక్.. 2019 కేసులో వారెంట్ జారీ
by Vemula.Srinu Prasad |
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది...

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani)కి బిగ్ షాక్ తగిలింది. అనూహ్యంగా 2019 కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయనకు వారెంట్ జారీ అయింది. 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షపై కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam)లో పేర్ని నాని కేసు నమోదు చేయించారు. అయితే ఈ కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు. కానీ ఈ కేసులో ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పేర్నినాని కోర్టుకు హాజరుకాలేదు. మూడు సార్లు వాయిదా వేసినా కానీ హాజరుకాకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. ఇందుకు సంబంధించి వారెంట్ జారీ చేసింది.
Next Story






