- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలాల్లో ఎలుగుబంట్లు హల్ చల్.. భయాందోళనలో రైతులు
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం ఎస్ఎస్ గుండ్లు గ్రామంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపింది. పంట పొలాల్లో హల్‌చల్ చేశాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంట్లు పట్టపగలే పంటలను ధ్వంసం చేస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) గుడిబండ మండలం ఎస్ఎస్ గుండ్లు (SS Gundlu Village)గ్రామంలో ఎలుగుబంట్ల( Bears) సంచారం కలకలం రేపింది. పంట పొలాల్లో హల్‌చల్ చేశాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంట్లు పట్టపగలే పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో గొర్రెల కాపరులు, గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. గుంపులుగా చేరిగట్టిగా కేకలు వేస్తూ ఎలుగుబంట్లను కొండప్రాంతాల్లోకి తరిమికొట్టారు. అయినప్పటికీ ఎప్పుడు జనావాసాల్లోకి వచ్చి ఏం చేస్తాయోననే భయాందోళనను వ్యక్తం చేశారు. పొలాల వైపు వెళ్లాలంటే వణికి పోతున్నారు.. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల సంచారానికి అడ్డుకట్ట వేయాలని కోరారు.
Next Story






