- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దపులి కలకలం: మూడు దూడల మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొత్తవీధి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది..

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharamaraju District) దేవీపట్నం మండలం(Devipatnam Mandalam) కొత్తవీధి సమీపంలో పెద్దపులి సంచారం(Tiger Roaming) కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పశువుల మందపై దాడి చేసి మూడు గేదె దూడల(Buffalo Calf)ను చంపింది. దీంతో పశువుల కాపరులు అడుగు పెట్టేందుకు భయపడిపోతున్నారు. స్థానిక గిరిజన గ్రామాల్లోనూ భయాందోళనల పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనాస్థలిని అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు సందర్శించారు. మృతి చెందిన దూడలను పరిశీలించారు. అవి పులి దాడిలోనే చనిపోయాయని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
పులి సంచారంతో...
పులి సంచారంతో కొత్తవీధి సమీపంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో పాటు ముసినిమిల్లి ప్రజలకు అధికారులు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. రాత్రి సమయాల్లో బయటకు రావద్దని, పశువుల పాకల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పులి కదలికలను గుర్తించేందుకు నిఘా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.






