- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నాకు క్యాన్సర్ అని చెప్పడం అత్యంత బాధాకరం’.. కూతురు వ్యాఖ్యలపై ముద్రగడ స్పందన
కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమారై క్రాంతి వెల్లడించారు. ఈ తరుణంలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని.. తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అయితే.. తాజాగా తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. మా చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి.. అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్నకొడుకే 100-1000 శాతం కారణం అని ఆయన తెలిపారు. రోజు అన్ని సేవలు నాకు చేయకుండా బయటకు వెళ్లడు అంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు.
కొందరు మా అబ్బాయిని నాకు దూరం చేస్తే.. నా కూతురు దగ్గరికి వెళ్తానని అనుకుంటున్నారు. కానీ.. ఎన్ని జన్మలెత్తినా ఆ ఇంటికి నేను వెళ్ళను అని ముద్రగడ తేల్చి చెప్పారు. నాకు క్యాన్సర్ అని, ఇంట్లో బంధించి.. ఇబ్బందులు పెడుతున్నారనడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉన్నాయే.. కానీ మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.






