- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలనంగా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం.. టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను సంచలనంగా మారింది...

X
దిశ, వెబ్ డెస్క్: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapudi Srinivasa Rao) వ్యవహారం తెలుగుదేశం(Telugu Desam Party) పార్టీలో పెను సంచలనంగా మారింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆయన ఇవాళ టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy)ని కలిసేందుకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న పెద్దిరెడ్డిని ఎమ్మెల్యే కొలికపూడి కలవడం చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొలికపూడి.. ఇపుడు వైసీపీ కీలక నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పెద్దిరెడ్డిని కలిసిన కొలికపూడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






