- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లు చేసిన తప్పులే వెంటాడుతుంటాయి : సీఎం
కుప్పంని కాలుష్య రహిత నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం.

దిశ, వెబ్ డెస్క్ : తప్పులు చేసిన వాళ్లకు నిద్ర రాదని.. వాళ్లు చేసిన తప్పులే వెంటాడుతుంటాయని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు. కుప్పంలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా బెగ్గిపల్లెలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 5,555 ఈ-సైకిల్లను పంపిణీ చేశారు. శివపురం నుంచి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు వేలాది ఈ-సైకిళ్ల ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. జీవితంలో నిద్ర చాలా ముఖ్యం అన్నారు. మంచి చేస్తే సుఖంగా నిద్రపడుతుందని పేర్కొ్న్నారు. శరీరానికి కొంత వ్యాయామం కూడా అవసరమని తెలిపారు. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పారు. కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని సీఎం అన్నారు. దాని వల్ల గిన్నీస్ రికార్డు వచ్చిందనేది విషయం కాదన్నారు. రాబోయే రోజుల్లో సైకిళ్లతోపాటు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ-సైకిళ్ల ద్వారా కుప్పంని కాలుష్య రహిత నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. నూతన చరిత్రకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టామన్నారు. ఇంటిపై ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్ తోనే సైకిల్ కు చార్జింగ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ సూపర్ సైకిల్ ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్తుందన్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపించామన్నారు.






