Vijayawada:కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో అపచారం.. స్పందించిన మంత్రి

by Jakkula Mamatha |   ( Updated:2025-02-09 08:53:26.0  )
Vijayawada:కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో అపచారం.. స్పందించిన మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) కనకదుర్గ అమ్మవారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్టాల్లోనే కాక దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉంటే.. అమ్మవారి లడ్డూ(Laddu) ప్రసాదంలో అపచారం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రసాదంలో వెంట్రుకలు దర్శనమిచ్చాయి.

ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు కనిపించడంతో వెంటనే ఓ భక్తుడు సామాజిక మాధ్యమాల్లో(Social Media) పోస్ట్ చేస్తూ.. మంత్రులకు ఫిర్యాదు(complaint) చేశాడు. ప్రసాదంలో నాణ్యత లేదని.. ఉదయం ఓ లడ్డూలో, సాయంత్రం మరో లడ్డూలోనూ వెంట్రుకలు కనిపించడంతో తాను నిర్ఘాంతపోయినట్లు ఆ భక్తుడు పేర్కొన్నారు. ఆ పోస్ట్‌లో మంత్రులు నారా లోకేష్(Minister Nara Lokesh), ఆనం రామానారయణ రెడ్డిలను ట్యాగ్ చేశాడు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌(Viral) కావడంతో.. భక్తుడు చేసిన ఫిర్యాదు(complaint) పై ఏపీ(Andhra Pradesh) దేవాదాయ శాఖ మంత్రి(Minister of Revenue) ఆనం రామనారయణ రెడ్డి(Anam Ramanarayana Reddy) స్పందించారు. భక్తుడికి క్షమాపణ చెబుతూ ఇంకో సారి తప్పు జరగకుండా చూస్తానని వెల్లడించారు.

Next Story

Most Viewed