- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TDP Mahanadu 2025:‘మహానాడు ఒక వైబ్రేషన్.. గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్’.. ఆ వీడియో షేర్ చేసిన మంత్రి
కడపలో మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు తొలిరోజు(మంగళవారం) కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: కడపలో మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు తొలిరోజు(మంగళవారం) కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. టీడీపీ మహానాడు కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో ప్రతినిధుల సభను ప్రారంభించారు. ఈ క్రమంలో దివంగత నేత మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించిన అద్భుతమైన వీడియోను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు.
టీడీపీ యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మహానాడుకు సంబంధించిన ఒక గ్లింప్స్ వీడియోను తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో(Video)లో టీడీపీ 2025 మహానాడు(TDP Mahanadu) ఉత్సాహాన్ని, ప్రాధాన్యతను వివరించారు. ఇందులో కడప జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు తొలి రోజు విశేషాలను పంచుకున్నారు. మహానాడు కేవలం ఒక కార్యక్రమం కాదని, అదొక వైబ్రేషన్ అని, గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్ అని మంత్రి లోకేష్ అద్భుతంగా అభివర్ణించారు. ప్రస్తుతం మంత్రి లోకేష్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహానాడు ఒక వైబ్రేషన్..
— Lokesh Nara (@naralokesh) May 27, 2025
గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్..#mahanadu2025begins #kadapa pic.twitter.com/4zGC2T4WYd






