- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కాపురం కేంద్రంగా జిల్లా.. మంత్రి కీలక వ్యాఖ్యలు
మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District)లో ప్రధాన పట్టణంగా ఉన్న మార్కాపురాన్ని(Markapuram) మరింత అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇందులో భాగంగా మార్కాపురం పట్టణం హెడ్ క్వార్టర్‌గా జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ప్రస్తుతం ఊపందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లా ఏర్పాటుపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి(Minister Dola Bala Veeranjaneyaswamy) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గత పాలనలో వైద్యారోగ్యశాఖను గాలికొదిలేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుందన్నారు. తొలి విడతలో అరకు మెడికల్ కాలేజీని పూర్తి చేస్తామన్నారు. 2026-2027 నాటికి కాలేజీలో తరగతులను ప్రారంభిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.






