- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి.. రాష్ట్ర ప్రజలకు మంత్రి కీలక హామీ
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఇవాళ(గురువారం) క్యాంపు కార్యాలయంలో కూటమి పాలన ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఎన్డీయే కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, మహిళా నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో కేకు కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచి, శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుక చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి రూ.120 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు. గత వైసీపీ పాలకులు చేసిన తప్పులు సరిచేసి, ప్రజా సంక్షేమాన్ని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, ప్రజల అభిప్రాయలకు విలువిస్తూ వారి ఆలోచనలు, ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందని తెలిపారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు, నేరాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో కూటమి పాలన సాగిస్తుందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని సువర్ణ రామచంద్రపురంగా అభివృద్ధి పరిచి ప్రజా పరిపాలన కొనసాగిస్తామన్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం గర్వకారణం అన్నారు.
ఏడాది కాలంలో నియోజవర్గం తో పాటు, కార్మిక శాఖను, కార్మికుల సంక్షేమాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం సుమారు 24 జాబ్ మేళాలు నిర్వహించి ప్రఖ్యాత కంపెనీలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా, అందుబాటులో ఉంటామని మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు.






