115 రోజుల్లో సిద్ధం.. 6 రోడ్ల నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-21 11:08:36  IST  )

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులపై మంత్రి కీలక ప్రకటన చేశారు..

115 రోజుల్లో సిద్ధం.. 6 రోడ్ల నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు(Bhogapuram Green Fied Airport)ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎయిర్ పోర్టు నిర్మణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.4 750 కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టును త్వరలో ప్రారంభంకానుంది. ఈ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Centra Minister RammohanNaidu), మంత్రి నారాయణ(Minister Narayana) నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భారీ యంత్రాలతో వందలాది లారీలు, వేలాది మంది కార్మికులతో నిర్మణం సాగుతోంది. ఇప్పటి వరకూ 75 శాతం పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టు రన్ వే, ఎయిర్ ట్రాఫిక్ పనులు, టెర్మినల్, ట్యాక్సీ వే, పిటూబి, ఇతర బిల్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


మరోవైపు ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు చాలా ఈజీగా చేరుకునేందుకు వీలుగా రహదారులను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణ పనులపై ఈ రోజు కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్ పోర్టు 2026 ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్ పోర్టును అనుసంధానం చేస్తూ 22 రోడ్లను ప్రాతిపాదించారని, త్వరలో 15 పూర్తి కాబోతున్నాయని చెప్పారు. 115 రోజుల్లో మిగిలిన 6 రోడ్ల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదిరిగా విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనులు మొదలుపెడతామని, డబుల్ డెక్కర్ మెట్రో కింద డీపీఆర్ ఇచ్చామని మంత్రి నారాయణ తెలిపారు.

Next Story