Vijayawada:దుర్గగుడి వద్ద దారుణ పరిస్థితులు.. భక్తులకు క్షమాపణ చెప్పిన మంత్రి(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-17 12:28:59  IST  )

విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

Vijayawada:దుర్గగుడి వద్ద దారుణ పరిస్థితులు.. భక్తులకు క్షమాపణ చెప్పిన మంత్రి(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించి సోషల్ మీడియా(Social Media)లో ఓ వీడియో వైరల్‌గా మారింది. దుర్గ గుడిలో తాగునీటి సమస్య ఉందంటూ.. ఈ విషయాన్ని కొంతమంది భక్తులు మంత్రి లోకేష్(Minister Nara Lokesh) దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని ప్రసాదం కౌంటర్ వద్ద తాగునీరు అందుబాటులో లేదని.. నిర్వహణ కూడా సరిగా లేదంటూ నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.

దీనికి సంబంధించిన వీడియోను కూడా అందుకు జత చేస్తూ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)లను ట్యాగ్ చేశారు. అసలు విషయంలోకి వెళితే.. విజయవాడ దుర్గ గుడి వద్ద దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ పలువురు భక్తులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు చేశారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత లోపించిందని, తాగు నీరు కూడా లేదని విమర్శించారు. అసలు ఇక్కడ ఈవో ఉన్నరా? అని ప్రశ్నించారు. దీంతో ఆ వీడియో పై స్పందించిన మంత్రి లోకేష్ భక్తులకు(Devotees) క్షమాపణలు చెప్పారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని, మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Next Story