అసలు ఆ రోజుల్లో.. కాలేజ్ డేస్ గుర్తుచేసుకున్న మంత్రి!

by Jakkula.Mamatha |

కర్ణాటక టి.ఏ. పాయ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కాన్వోకేషన్‌లో ముఖ్య అతిధిగా ఏపీ(Andhra Pradesh) ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Minister payyavula Keshav) పాల్గొన్నారు.

అసలు ఆ రోజుల్లో.. కాలేజ్ డేస్ గుర్తుచేసుకున్న మంత్రి!
X

దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక టి.ఏ. పాయ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కాన్వోకేషన్‌లో ముఖ్య అతిధిగా ఏపీ(Andhra Pradesh) ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Minister payyavula Keshav) పాల్గొన్నారు. అయితే తను ఇదే బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించి ఎంబీఏ పట్టా తీసుకున్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. మంత్రి పయ్యావుల పట్టా తీసుకున్న బిజినెస్ స్కూల్‌లోనే విద్యార్థులకు పట్టా ఇచ్చే అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందించారు.

కాలేజ్ డేస్ లో రాత్రిళ్లు ఛాయ్ బ్రెడ్ కోసం ఎక్కడ వరకు వెళ్లేవారో.. అప్పుడు మణిపాల్ ప్రాంతం ఎలా ఉండేదో వివరించారు. తన కాలేజీ స్నేహితులతో ఇప్పటికీ టచ్‌లో ఉంటున్నానని మంత్రి వెల్లడించారు. బిజినెస్ స్కూల్లో తాను నేర్చుకున్న అంశాలు రాజకీయ రంగంలో ఎలా ఉపయోగపడ్డాయో వివరించారు. కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. జీవితంలో ప్లే బుక్, గైడ్ లాంటివి ఉండవు. ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా అధిగమిస్తూ సక్సెస్ సాధించాలి. రిస్క్ తీసుకునే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. మన స్టోరీని మనమే రాసుకోవాలి. సక్సెస్ అవ్వాలి. ఎదుటి వారు చెప్పేది వినండి.

వారి ఆలోచనలు గౌరవించండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అన్నింటికంటే ముఖ్యమని తెలిపారు. రాజకీయంలో నేనేమీ ఈజీగా ఎదగలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను. ఎంతో మంది సీనియర్ లీడర్లతో పోటీపడి పైచేయి సాధించాను. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మణిపాల్ ప్రాంతం చాలా చిన్నదిగా ఉండేది. రాత్రి ఎనిమిది గంటలు కాగానే సైలెంటైపోయేది. ఇప్పుడు మీకు స్విగ్గీ, జొమాటో అందుబాటులో ఉన్నాయి. కానీ మా రోజుల్లో అవేం లేవు. ఛాయ్, బ్రెడ్ కోసం టైగర్ సర్కిల్ వరకు వెళ్లే వాళ్లమని.. మాది 48 మందితో ఉన్న టీమ్. ఇప్పటికీ మేమందరం టచ్‌లో ఉంటామని మంత్రి పయ్యావుల తెలిపారు.

Next Story