- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతంలో పెరిగిన పులుల సంచారం
రాష్ట్రం(Andhra Pradesh)లో పులుల(tigers) సంచారం ప్రజలను భయాందోళనలకు(Panic) గురి చేస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో పులుల(tigers) సంచారం ప్రజలను భయాందోళనలకు(Panic) గురి చేస్తోంది. ఇటీవల కాలంలో పులులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్న ఘటనలు కూడా వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా జంతు గణన(Animal count)కు అటవీ అధికారులు(Forest officials) శ్రీకారం చుట్టారు. అందుకు అనుగుణంగా పల్నాడు జిల్లా(Palnadu District) వెల్దుర్తి మండల(Veldurthi Mandal) పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం(Forest area)లో పులుల సంచారం పెరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు.
సాంకేతికత(Technology) ద్వారా జంతు గణన చేపట్టారు. అటవీ ప్రాంతంలోని నీటి కుంట వద్దకు వచ్చిన పులుల దృశ్యాలు తాజాగా ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈనెల(ఫిబ్రవరి) 10వ తేదీకే పులుల గణన ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గత ఏడాది కంటే పులుల సంఖ్య మరింత పెరిగిందని అధికారులు వెల్లడించారు. ట్రాప్ కెమెరాల్లో రికార్డైన చిత్రాలు(Images), పాదముద్రలు(footprints) సేకరించామన్నారు. ఈ నేపథ్యంలో పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.






