రాష్ట్రంలో ఎండలు.. వర్షాలు: 151 మండలాలకు బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. గురువారం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

రాష్ట్రంలో ఎండలు.. వర్షాలు: 151 మండలాలకు బిగ్ అలర్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. గురువారం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 382 మండలాల్లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 24) కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎల్లుండి కూడా...

ఇక ఎల్లుండి కూడా 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 31 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత, వడగాలుల నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు టోపీలు ధరించడం, చెవులు, కళ్లను రక్షించుకోవడం అవసరమన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని హెచ్చరించారు. తాగునీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అలాగే ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడరాదని అప్రమత్తం చేశారు.

Next Story