ఏపీలో వారమంతా వానలే.. వాతావరణ శాఖ హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వారం రోజులపాటు వర్షం పడుతుందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని, అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది..

ఏపీలో వారమంతా వానలే.. వాతావరణ శాఖ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజల(Ap People)కు వాతావరణ శాఖ(Weather Department) బిగ్ అలర్ట్ జారీ చేసింది. వారం రోజులపాటు వర్షం పడుతుందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు(Rains) పడతాయని, అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణ(Uttara Telangana) మీదుగాఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రుతుపవన పరిస్థితి సైతం కొనసాగుతోందని, ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఈ రోజు వరకూ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

Next Story