- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి చల్లని కబురు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాదు విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాదు విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
జనులకు ఉపశమనం
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనులకు ఈ వర్షాల కారణంగా ఉపశమనం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
వాతావరణం అనుకూలంగా లేనందున రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా తీరంలోని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాల రాకపై కూడా ఐఎండీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మరో 48 గంటల్లోపు ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని, తద్వారా దేశంలోకి వర్షాకాలం అధికారికంగా ప్రవేశిస్తుందని పేర్కొంది.






