రాష్ట్రానికి మరో గండం.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాష్ట్రానికి మూడు రోజుల్లో మరో గండం ఏర్పడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది...

రాష్ట్రానికి మరో గండం.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) వర్షాలు కుమ్మేస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఏపీ(Ap), తెలంగాణ(Telangana)లో భారీగా నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని కామారెడ్డి(Kamareddy) జిల్లాలో భారీగా ఆస్తి, పంట వర్షాల పాలైంది. చాలా ప్రాంతాల్లో వరద నీళ్లు(Flood Water) ఇళ్లలోకి చేరాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు.

ఏపీలోనూ వర్షం

ఇక ఏపీలోనూ వర్షం భారీగా కురిసింది. బంగాళాఖాతం(Bangalakhatam)లో ఏర్పడిన అల్పపీడనాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు భారీగా కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గోదావరి(Godavari), కృష్ణా నదులు(Krishna River) ఉధృతంగా ప్రవహించాయి.

మరో అల్పపీడనం


అయితే రాష్ట్రానికి మరో అల్పపీడనం గండం పొంచి ఉంది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనంకొన సాగుతోంది. అయితే ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తత ప్రకటించారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాసాలకు తరలివెళ్లాలని చెప్పారు. అల్పపీడనం గండం తప్పేవరకు మత్య్సకారులు సముంద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ తెలిపారు.

Next Story