A To Z Babu: లేడీస్ పై వ్యక్తి పరాచికాలు.. తాటతీసిన మహిళలు..ఆడాళ్ళా మజాకా..

by Disha Web Desk 3 |
A To Z Babu: లేడీస్ పై వ్యక్తి పరాచికాలు.. తాటతీసిన మహిళలు..ఆడాళ్ళా మజాకా..
X

దిశ వెబ్ డెస్క్: ఆడవాళ్లు వీళ్ళేం చేస్తారులే అనుకుంటే పొరపాటే.. ఏదైనా లిమిట్ లో ఉన్నంత వరకే మహిళలు ఓర్పుకు మారుపేరు. సైలెంట్ గా ఉన్నారు కదా అని నకరాలు చేస్తే నరాలు తీస్తాం బిడ్డా అని నిరూపించారు నంద్యాల మహిళలు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలలో ఉన్న ఆయుష్ యోగ సెంటర్ లో కొందరు మహిళలు యోగాభ్యాసం చేస్తుంటారు. అయితే ఆ యోగా సెంటర్ కి A టు Z బాబు అనే వ్యక్తి వచ్చారు.

పేరుకు తగ్గట్టుగానే A టు Z తనకే తెలుసు అన్నట్లు భావించి ఆ యోగా సెంటర్ కి వచ్చే మహిళలపై అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయసాగారు. అయితే విషయం తెలుసుకున్న మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. తమపైన సభ్యకర రాతలు రాస్తున్న A టు Z బాబు ఇంటికి వెళ్లిన మహిళలు.. ఇంట్లో ఉన్న A టు Z బాబుని గల్లా పట్టుకుని ఇంటి బయటకు ఈడ్చుకు వచ్చారు.

తమపై అడ్డమైన రాతలు రాస్తావా అంటూ A టు Z బాబుని బూతులు తిడుతూ చితకబాదారు. అనంతరం పోలీసు స్టేషన్ కి తీసుకు వెళ్లి పోలీసులకు అప్పగించారు. కాగా ఈ విషయం తెలిసిన స్థానికులు.. మహిళలపై తప్పుడు రాతలు రాసినందుకు తగిన శాస్తి జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed