నగల కోసం పనిమనిషే ఆ ఘోరానికి పాల్పడింది..

by Thanuru Gopichand |

కర్నూలు నగరంలో వృద్దురాలి హత్య కేసును త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు.

నగల కోసం పనిమనిషే ఆ ఘోరానికి పాల్పడింది..
X

దిశ, కర్నూలు క్రైం : కర్నూలు నగరంలో వృద్దురాలి హత్య కేసును త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు. హత్య నేరానికి పాల్పడిన ఇంటి పనిమనిషి కురువ వరలక్ష్మి (49)ను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్ బుక్లు, హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం మీడియా స మావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 1న కర్నూలు టౌన్ గణేష్ నగర్‌లోని కాటసాని శివలీల (75)ను ఆమె ఇంట్లోనే హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. వృద్ధురాలిని రోకలి బండతో తలపై బలంగా కొట్టి హత్య చేసి, ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని వరలక్ష్మి పారిపోయిందని వివరించారు. మెయిన్ రోడ్డులోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితురాలి కదలికలను గుర్తించగా, ఘటనాస్థలంలో లభించిన వేలిముద్రలతో ఆమె ప్రమేయం తేలిం దని ఎస్పీ తెలిపారు.జిల్లాలో 5 వేల సీసీ కెమెరాలు, కర్నూలు పట్టణంలోనే 2 వేల కెమెరాలను ఏర్పాటు చేశాం. ఈ కేసు ఛేదనలో అవి కీలకంగా మారాయి అని ఆయన పేర్కొన్నారు.తక్షణమే కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బం దిని ఎస్పీ అభినందిస్తూ రివార్డులు అందజేశారు.

Next Story