శ్రీకాకుళం జిల్లా వాసులకు గుడ్ న్యూస్ .. రామ్మోహన్ నాయుడు ఫుల్ హ్యాపీ

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్‌లకు కేంద్రం నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది...

శ్రీకాకుళం జిల్లా వాసులకు గుడ్ న్యూస్ .. రామ్మోహన్ నాయుడు  ఫుల్ హ్యాపీ
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) వాసుల దీర్ఘకాలిక రైల్వే(Railway) డిమాండ్‌లకు కేంద్రం నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యం కోసం ‌కీలక రైల్వే స్టేషన్లలో హాల్ట్‌లు మంజూరు చేసింది. ఇచ్చాపురం(Itchapuram) రైల్వే స్టేషన్‌లో పూరి–అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌ కొద్దిసేపు నిలుస్తుంది. అనంతరం వెళ్లిపోతుంది. తిలారు వద్ద బెరంపూర్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌కు, బారువ వద్ద భువనేశ్వర్–న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ మంజూరు చేశారు. ఆయా స్టేషన్లలో రైళ్ల నిలుపుదలను త్వరలోనే అమలు చేయనున్నారు.

ఫలించిన కేంద్రమంత్రి కృషి

దీంతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లానని, ఇన్ని రోజులకు తన కృషి ఫలించిందని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. తన విన్నపాన్ని సానుకూలంగా విని రైళ్ల హాల్ట్ మంజూరు చేశారని, ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రామ్మోహన్ నాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి తీసుకున్న ఈ చొరవ శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైలు సౌకర్యాలు, అభివృద్ధి దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.

ట్వీట్...


Next Story