TTD News : "తిరుపతి తొక్కిసలాట" వెనుక ఆ నాయకుడు : టీటీడీ ఛైర్మన్ సంచలన ఆరోపణలు

by Muthe.Rajitha |

గత జనవరిలో జరిగిన 'తిరుపతి తొక్కిసలాట'(Tirupati Stampede)పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) సంచలన ఆరోపణలు చేశారు.

TTD News : తిరుపతి తొక్కిసలాట వెనుక ఆ నాయకుడు : టీటీడీ ఛైర్మన్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : గత జనవరిలో జరిగిన 'తిరుపతి తొక్కిసలాట'(Tirupati Stampede)పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి తొక్కిసలాట వెనుక వైసీపీకి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన వెనుక భూమన, హరినాథ్ రెడ్డి హస్తం ఉండవచ్చని.. ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.

అయితే తిరుపతి ఎస్వీ గోశాలలో గోవులు మృతి(Goshala Issue) చెందాయి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవులమృతిపై మార్ఫింగ్ ఫోటోలు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి దురుద్దేశంతో ఫోటోలు మార్ఫింగ్ చేసి, వైసీపీకి అందజేశారని.. వారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోబోమని వారి ఇరువురిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.

Next Story