- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎంపీ సత్యనారాయణకు బిగ్ షాక్.. రూ.11 కోట్లు చెల్లించాలని నోటీసులు..!
విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణకు కార్మిక శాఖ బిగ్ షాక్ ఇవ్వనుంది...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణ(Former Visakhapatnam MP Satyanarayana)కు కార్మిక శాఖ(Labor Department) బిగ్ షాక్ ఇవ్వనుంది. ఆ శాఖకు రూ.11 కోట్ల బకాయిల చెల్లించాలని నోటీసులు జారీ చేయనుంది. ఈ మేరకు అధికారులను మంత్రి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Labour Minister Vasansetty Subhash)ఆదేశించనున్నారు.
విశాఖ హోటల్ మేఘాలయలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్(Jagan) ప్రభుత్వంలో మాజీ ఎంపీ సత్యనారాయణ కార్మిక శాఖకు రూ.11 కోట్ల చెల్లించాల్సి ఉందని, ఆయన ఇప్పటి వరకూ కట్టలేదన్నారు. ఈ బకాయిని త్వరగా చెల్లించేలా నోటీసులు జారీ చేయాలని అధికారులను తాను ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వబోతున్నామని, ఈ మేరకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని త్వరలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి పేర్కొన్నారు.






