సాగరతీరంలో గాలిపటమా పద పద..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-13 15:43:55  IST  )

సంక్రాంతి భోగి పండుగను పురస్కరించుకుని ప్రతీయేటా అల్లవరం మండలం ఓడలరేవు సాగర తీరంలో నిర్వహించే కైట్‌ ఫెస్టివల్‌ సోమవారం ఉత్సాహంగా సాగింది....

సాగరతీరంలో గాలిపటమా పద పద..!
X

దిశ, అల్లవరం: సంక్రాంతి భోగి పండుగను పురస్కరించుకుని ప్రతీయేటా అల్లవరం మండలం ఓడలరేవు సాగర తీరంలో నిర్వహించే కైట్‌ ఫెస్టివల్‌ సోమవారం ఉత్సాహంగా సాగింది.. సుదూర ప్రాంతాలనుంచి తరలివచ్చిన వేలాది మంది ఓడలరేవు సాగర తీరంలో పతంగులను ఎగురవేశారు. తొమ్మిదేళ్ల నుంచి నిర్వహిస్తోన్న ఈ కైట్‌ ఫెస్టివల్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు పాల్గొని ఎంజాయ్‌ చేశారు.


అయితే ఓడలరేవు తీరానికి భారీ స్థాయిలో తరలిరావడంతో కొంత ట్రాపిక్‌ జామ్‌ అయ్యింది. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా కైట్‌ ఫెస్టివల్‌కు తరలివచ్చి పతంగులను ఎగురవేశారు. చైనా మాంజాలను నిషేదించిన క్రమంలో కాటన్‌ దారంతోనే ఎగురవేసేలా చర్యలు తీసుకున్నారు. మెరైన్‌ సీఐ మూర్తి, అల్లవరం ఎస్సై హరీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో అల్లవరం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కైట్‌ ఫెస్టివల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు తాడి ధర్మారావు, మెయిన్‌ స్పోన్సర్‌ పెమ్మాడి రమేష్‌, మాజీ సర్పంచ్‌ కొల్లు విష్ణుమూర్తి, నాతి లెనిన్‌ బాబు, పాల వెంకటేశ్వరరావు, కొప్పాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story