makar sankranti: కలర్ ఫుల్‌గా కైట్ ఫెస్టివల్.. రేపు, ఎల్లుండి కూడా కనువిందు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-14 01:34:09  IST  )

మకర సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో కలర్ ఫుల్‌గా కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది...

makar sankranti: కలర్ ఫుల్‌గా కైట్ ఫెస్టివల్.. రేపు, ఎల్లుండి కూడా కనువిందు
X

దిశ, వెబ్ డెస్క్: మకర సంక్రాంతి సందర్భంగా(makar sankranti) హైదరాబాద్‌(Hyderabad)లో కలర్ ఫుల్‌గా కైట్ ఫెస్టివల్(Kite Festival) కొనసాగుతోంది. యువత కైట్స్ ఎగురవేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనూ కైట్ అంట్ స్వీట్ ఫెస్టివల్ జరిగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌లో 19 దేశాలకు చెందిన 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ పాల్గొన్నారు. వివిధ రూపాల్లో ఉన్న పతంగులకు ఎగురవేసి సందడి చేశారు. స్పైడర్ మేన్, స్నేక్స్, బర్డ్స్ రూపాల్లో ఉన్న పతంగులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మరో రెండు రోజుల పాటు భాగ్య నగరవాసులను ఈ కైట్స్ కనువిందు చేయనున్నాయి.


మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశంలో పతంగుల జాతర కనిపిస్తోంది. ఫెస్టివల్‌లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎటు చూసినా రంగు రంగుల కైట్స్ కనువిందు చేస్తున్నాయి. ఏ బిల్డింగ్‌పై చూసినా పిల్లలు పతంగులు ఎగువేస్తూ కనిపిస్తున్నారు. అరుపులు, కేకలతో కైట్ ఫెస్టివల్ శిబిరాలు దద్దరిల్లిపోతున్నాయి. కొన్ని చోట్ల పరిమిత సౌండ్స్‌తో డీజేలు పెట్టి సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు.

Next Story