- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan: కొంపముంచిన.. జగన్ కోటరీ..?
తన చుట్టూ ఉన్న కోటరీనే జగన్కొం ప ముంచిందా..? ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విస్తృత్రంగా జరిగిన చర్చ ఇది. అధికారం కోల్పోయి దాదాపు పది నెలలు కావొస్తోంది.

పది నెలల తర్వాత కూడా కోటరీ చుట్టూ రాజకీయం
సీనియర్‌నేతలు కూడా అదే మాట..
ఆ కోటరీని వదిలితేనే.. జగన్‌కు భవిష్యత్?
దిశ, డైనమిక్ బ్యూరో: తన చుట్టూ ఉన్న కోటరీనే జగన్ (YS Jagan)కొంప ముంచిందా..? ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విస్తృత్రంగా జరిగిన చర్చ ఇది. అధికారం కోల్పోయి దాదాపు పది నెలలు కావొస్తోంది. ఇప్పడు కూడా అదే కోటరీ గురించి మాట్లాడుతున్నారు.. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు సైతం ఆ కోటరీపైనే ఆరోపణలు చేస్తున్నారు. నిన్న విజసాయిరెడ్డి (Vijayasaireddy) కూడా ఇదే ఆరోపణలు చేశారు. జగన్చుట్టూ ఉన్న కోటరీనే తనను దూరం చేసిందన్నారు. ఇప్పటికైనా దానిని దూరం పెట్టాలని ఆయన సూచించారు. అంటే అప్పుడూ.. ఇప్పుడూ అదే కోటరీ జగన్చుట్టూ ఉందనే విషయం స్పష్టం అవుతోంది. జగన్అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యంగా నెంబర్‌టూ ఎవరు అని చర్చ వచ్చినపుడు విజయసాయి, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు వినిపించేవి. అటువంటి విజయసాయి .. అదే కోటరీపై విమర్శలు చేయడం అప్పుడు ఆశ్చర్యానికి గురి చేసింది.
వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) సకల శాఖల మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్‌కు ఆయనే స్క్రిప్టు ఇస్తారని అంతా అనుకుంటుంటారు. విజయసాయి రెడ్డి జగన్ వ్యాపారాలు చూస్తుండగా.. సజ్జల ఆయన రాజకీయ వ్యవహారాలను నడిపించేవారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి దిశానిర్దేశం చేసేవారు. ఆయన కుమారుడు సోషల్‌మీడియాను నడిపించేవారు. వైఎస్సార్‌కు కేవీపి ఎలాగో.. జగన్‌కు సజ్జల అలా అనే గుర్తింపు పొందారు.
ఆయనతోపాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy) జగన్వెన్నంటి ఉండేవారు. హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జగన్పాల్గొన్నప్పుడు ఆయన వెంట ఉండి నడిపించేవారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లలో తన కుమారుడిపై కేసు నమోదు అవడం, అతని అరెస్టు చేసి విడిచి పెట్టిన తర్వాత ఆయన పార్టీ వ్యవహారాల్లో కొంతకాలం దూరంగా ఉన్నారు. అంతకు ముందు జగన్కోటరీలో చెవిరెడ్డి ఒకరనే పేరు ఉండేది. జగన్కోటరీలో వైవీ సుబ్బారెడ్డి పేరుకూడా వినిపించేది. జగనకు ఆయన స్వయానా బంధువు. టీటీడీ చైర్మన్పదవితో పాటు, రాజ్యసభ స్థానాన్ని కూడా దక్కించుకున్నారు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy) మిధున్‌రెడ్డి.. వీరంతా జగన్చుట్టూ ఉండి రాజకీయాలు నడిపిస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ కోటరీ వల్లే జగన్నష్టపోయారని నిన్న విజయసాయి చెప్పారు. అదే విషయాన్ని గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni) తన రాజీనామా సమయంలో చెప్పారు. బాలినేని కూడా జగన్‌కు అత్యంత సన్నిహితుడు.. వైఎస్‌జగన్‌కు సన్నిహితంగా ఉన్నవారే కోటరీపై ఆరోపణలు చేయడం.. అసలు ఎవరా కోటరీ..? వారిని జగన్ఇకనైనా దూరం పెడతారా..? అని ఆ పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది.
కోటరీలో ఉన్నవారే కోటరీపై విమర్శలా?
నిన్నటి వరకు వైయస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Aamaranadh) ఆరోపించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కోటరీ అనేది అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో సాధారణంగా కనిపించేదే అన్నారు.. టీడీపీలో చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? ఆ కోటరీల గురించి బయట ఉన్న వారు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. అంతేకానీ కోటరీలో ఉండి వచ్చిన వ్యక్తులే కోటరీ గురించి మాట్లాడటం భావ్యం అనిపించుకోదు అన్నారు. విజయసాయిరెడ్డికి ఒకరి మీద మనసు విరిగిపోయిందంటే ఇంకొకరి ప్రేమ పుట్టిందనే అనుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also..
TDP Leaders: ఉమ్మడి ఏపీలో టీడీపీ నేతలపై నమోదైన కేసు కొట్టివేత






