- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్టోడియల్ టార్చర్ కేసు.. ముగిసిన సునీల్ నాయక్ విచారణ
టీడీపీ నేత రఘురామకృష్ణరాజు సీఐడీ కస్టడీ టార్చర్ కేసు లో ఐపీఎస్ సునీల్ నాయక్‌కు విచారణ కొనసాగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత రఘురామకృష్ణరాజు(TDP leader Raghuramakrishna Raju) సీఐడీ కస్టడీ టార్చర్ కేసు(CID custody torture case)లో ఐపీఎస్ సునీల్ నాయక్(IPS Sunil Nayak)కు విచారణ(Investigation) కొనసాగుతోంది. ఐదు రోజుల పాటు కస్టడీలో భాగంగా ఆదివారం నాలుగో రోజు విచారణ ముగిసింది. గుంటూరు ఎస్పీ దామోదర్(Guntur SP Damodar) నేతృత్వంలో సీసీఎస్ పీఎస్‌లో సునీల్ నాయక్‌ను ప్రశ్నిస్తున్నారు.
సరైన సమాధాలు చెప్పని సునీల్ నాయక్
అయితే సునీల్ నాయక్ సరైన సమాధాలు చెప్పడంలేదని పోలీసులు చెబుతున్నారు. రఘురామ టార్చర్‌కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలతో సునీల్ నాయక్ కు సోమవారం సాయంత్రం వరకూ విచారణ కొనసాగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు సునీల్ నాయక్ మళ్లీ విచారణకు హాజరుకానున్నారు. ఆదివారం విచారణ ముగియడంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు. సోమవారం ఉదయం జైలు నుంచి గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోనున్నారు.






