చట్టం ముందు నిలబెడతాం.. పోలీస్ అధికారులకు అంబటి వార్నింగ్

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సాగిన విచారణ ముగిసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు సుమారు రెండు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు

చట్టం ముందు నిలబెడతాం.. పోలీస్ అధికారులకు అంబటి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) వేంపల్లి పోలీస్ స్టేషన్‌(Vempally Police Station)లో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)పై సాగిన విచారణ ముగిసింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు సుమారు రెండు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం స్టేషన్ బయట అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తనపై జరిగిన విచారణ తీరును వివరించారు. ఒకే అంశాన్ని సాకుగా చూపి రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడం ఏంటని అంబటి ప్రశ్నించారు.

లోకేష్ ఆదేశాలతోనే వేధింపులు

ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాము వైఎస్సార్ వారసులమని, ఇలాంటి బెదిరింపులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్

రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల జాబితా తమ వద్ద ఉందని, సమయం వచ్చినప్పుడు వారందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టి వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదని, అధికార గర్వంతో వ్యవహరించడం మానుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.

Next Story