- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు అలర్ట్..రానున్న రెండు రోజులు జాగ్రత్త
ఏపీ ప్రజలకు అలర్ట్. రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. 42 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఇవాళ మొత్తం 54 మండలాలలో తీవ్ర వడగాలులు, 16 మండలాలలో వడగాలులు వీచే ప్రమాదం పొంచి ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇక రేపు 41 మండలాలలో తీవ్ర వడగాలులు, 21 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
విజయనగరంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు
గురువారం రోజున విజయనగరం జిల్లా రాజాంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 40.6 డిగ్రీలు నమోదు అయింది. మన్యంలోని మక్కువ, చిత్తూరులోని నిండ్ర ప్రాంతంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖార్ జైన్ కీలక సూచనలు చేశారు.
ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (#APSDMA)
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) April 2, 2026
రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ప్రభావం చూపనున్న ఎండ తీవ్రత
42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం
రేపు 54మండలాల్లో తీవ్రవడగాలులు,16మండలాల్లో వడగాలులు
ఎల్లుండి 41మండలాల్లో తీవ్రవడగాలులు,21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం pic.twitter.com/EuU7EZmulN






