- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్కువ ధరకే బంగారం .. సినీఫక్కీలో రూ. 25 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
సినీ ఫక్కీల్లో కేటుగాళ్లు డబ్బులు కొట్టేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ..

దిశ, వెబ్ డెస్క్: సినీ ఫక్కీల్లో కేటుగాళ్లు రూ.25 లక్షలు కొట్టేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ శ్రీగణేశ్ వ్యక్తిని బురిడీ కొట్టింది. రూ. 25 లక్షలకు డీల్ మాట్లాడుకున్నారు. డబ్బు ఇచ్చి బంగారం తీసుకెళ్లేందుకు కోటప్పకొండ వద్దకు రావాలని సూచించారు. శ్రీగణేశ్ అక్కడికి వెళ్లగానే ముందు స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్పారు. ఇంతలో కంత్రీగాళ్లు పోలీస్ దుస్తులతో జీపులో వెళ్లారు. శ్రీగణేశ్ వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ని చెక్ చేయాలని చెప్పారు. నిజమైన పోలీసులు వచ్చారనుకొని రూ. 25 లక్షల బ్యాగ్ ఇచ్చారు. దీంతో బ్యాగ్ తీసుకుని సినీఫక్కీలో పారిపోయారు. ఈ ఊహించని పరిణామంతో బాధితుడు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అనంతరం నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మిత్రుడు నరేష్ పాత్రపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






