పల్నాడు జిల్లాలో దంపతులపై దారుణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-16 07:06:34  IST  )

దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది....

పల్నాడు జిల్లాలో దంపతులపై దారుణం
X

దిశ, వెబ్ డెస్క్/ వినుకొండ: నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో బయట నిద్రిస్తున్న పెద్ద శ్రీను, మంగమ్మ దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ దాడిలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సుమారు రాత్రి 2 గంటల సమయంలో జరగింది. అయితే మంటలకు తట్టుకోలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలను ఆర్పేసి, గాయపడిన దంపతులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు దర్యాప్తు ప్రారంభం

ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు, దాడి వెనుక గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వ్యక్తిగత కక్షలు, ఆస్తి వివాదాలు లేదా మరేవైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ దాడి గురించి తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story