- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగాంధ్ర కార్యక్రమంలో రచ్చ.. మ్యాట్‌లు ఎత్తుకెల్లిన వైనం
ఏపీ(Andhra Pradesh)లోని విశాఖలో ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని విశాఖలో ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో దూర ప్రాంతాల ప్రజలు ఉదయాన్నే విశాఖకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏ లోటు రాకుండా కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఫుడ్ ప్యాకెట్లు, మ్యాట్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమంలో ఫుడ్ ప్యాకెట్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే స్వల్ప కొట్లాట కూడా చోటు చేసుకుంది. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసిన అక్కడ స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరైతే యోగాసనాల కోసం ఏర్పాటు చేసిన మ్యాట్‌లను సైతం ఎత్తుకెళ్లారు. ఫుడ్ ప్యాకెట్లు ఉన్న సంచులను సైతం తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






