- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగి నిర్వాకం: వృద్ధుల పెన్షన్ డబ్బులు స్వాహా..!
వృద్ధుల పెన్షన్ డబ్బులు స్వాహా చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది..

X
దిశ, వెబ్ డెస్క్: వృద్ధుల(Oldage) పెన్షన్(Penstion) డబ్బులు స్వాహా చేసిన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు(Dodleru)లో జరిగింది. ఈ నెల 1న స్థానిక వృద్ధులకు పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అయితే పెన్షన్ డబ్బులు ఇస్తానని వృద్ధుల నుంచి సచివాలయ ఉద్యోగి మనోజ్ వేలి ముద్రలు తీసుకున్నారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పెన్షన్‌దారులు ఆందోళనకు దిగారు. సచివాలయ ఉద్యోగి(Secretariat employee) మనోజ్‌ను గదిలో నిర్బంధించారు. పెన్షన్ డబ్బులపై నిలదీశారు. మనోజ్ పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో వేలి ముద్రలు తీసుకుని డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు. అలాగే యూరియా ఇప్పిస్తానని కూడా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగి మనోజ్‌పై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని వృద్ధులు కోరుతున్నారు.
Next Story






