అసెంబ్లీని తాకనున్న లడ్డూ కల్తీ ఘటన.. టీడీపీ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి ఘటన మరోసారి సంచలనంగా మారింది. .

అసెంబ్లీని తాకనున్న లడ్డూ కల్తీ ఘటన.. టీడీపీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి(Tirumala Srivari laddu adulterated ghee) ఘటన మరోసారి సంచలనంగా మారింది. వైసీపీ(Ycp) హయాంలో తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యి(Ghee)లో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసి సిట్‌కు అప్పగించింది. అయితే వైసీపీ అభ్యంతరంతో సీబీఐ బృందంలోని సిట్ సభ్యులు విచారణ పూర్తి చేశారు. ఇటీవల కోర్టులో నివేదిక అందజేశారు. అయితే తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని, కానీ కల్తీ జరిగిందని రిపోర్టులో పేర్కొంది. దీంతో గతంలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. తమకు సిట్ క్లీన్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే కల్తీ జరిగిందని కూటమి నేతలు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కల్తీ ఘటన అంశాన్ని అసెంబ్లీలో చర్చిస్తామని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(TDP State President Palla Srinivas Rao) తెలిపారు. విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఈవో వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని, కానీ మాజీ సీఎం జగన్ మాత్రం అసలు అలా జరగలేదని చెబుతున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కెమికల్స్ కూడిన నెయ్యిని వినియోగించారని ఆరోపించారు. అప్పటి వైసీపీ నేతలు డబ్బులకు కక్కుర్తి పడ్డారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైఎస్ జగన్‌ను బాధ్యుడిని చేయాలన్నారు. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టమని, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.

Next Story