Eruvaka: ఊరూరా ఏరువాక .. కాడి పట్టిన హోమంత్రి

by Thanuru Gopichand |

ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్లకు పూజలు చేసి పొలందున్నారు.

Eruvaka: ఊరూరా ఏరువాక .. కాడి పట్టిన హోమంత్రి
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్లకు పూజలు చేసి పొలందున్నారు. ఏపీలోని పలువురు మంత్రలు ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాయక రావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో ఎద్దులకు మంత్రి వంగలపూడి అనిత (Home minester Anitha) పూజ చేశారు. ఈ ఏడాది సిరులు పండించాలని కోరుకుంటూ అన్నదాతల ఏరువాక పండుగలో భాగమయ్యా నని ఆమె అన్నారు. అనంతరం కాడెడ్లతో నాగలి పట్టుకొని పొలం దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కూటమి ప్రభుత్వం 80 శాతం రాయితీపై అందించిన డ్రోన్ ను ప్రారంభించారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.

Next Story