Ontimitta: కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

by Vemula.Srinu Prasad |

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతోంది...

Ontimitta: కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
X

దిశ, వెబ్ డెస్క్: ఒంటిమిట్ట(Ontimitta) కోదండరామస్వామి ఆలయం(Kodandaramaswamy Temple)లో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, బలిహరణ,శాత్తుమొర, నివేదన, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, గరుడాళ్వార్‌కు, యాగశాల హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజ స్తంభానికి పూజలు నిర్వహించారు.

Next Story