స్టెల్లా షిప్ వ్యవహారంపై హైకోర్టు సంచలన ప్రశ్నలు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

స్టెల్లా షిప్ వ్యవహారంపై హైకోర్టు సంచలన ప్రశ్నలు సంధించింది...

స్టెల్లా షిప్ వ్యవహారంపై హైకోర్టు సంచలన ప్రశ్నలు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ పోర్టు(Kakinada Port) నుంచి స్టెల్లా షిప్‌(Stella ship)లో విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అక్రమ వ్యవహారం తేలేవరకూ షిప్‌ను సీజ్ చేయాలని అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సైతం ఆదేశించారు. అప్పటి నుంచి స్టెల్లా షిప్(Stella ship) వ్యవహారం సస్పెన్స్‌గా మారింది. షిప్‌లో బియ్యం లోడ్ చేయడం లేదు. దీంతో ఈ షిప్ రవాణా వ్యవహారం హైకోర్టు(High Court)కు చేరింది.

తమ బియ్యాన్ని షిప్‌లో లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగీ, ఎక్స్ పోర్ట్, పద్మశ్రీ రైస్ మిల్, సూర్యశ్రీ రైస్ మిల్ యజమానులు భాస్కరరెడ్డి, గంగిరెడ్డి, విశ్వనాధ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పారా బాయిల్డ్ బియ్యాన్ని షిప్‌లో లోడ్ చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. అసలు బియ్యం రవాణాకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. షిప్‌లో ఉన్న బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటని నిలదీసింది. పూర్తి వివరాలు సమర్పించాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. ఇందుకు సమయం కోరడంతో విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

Next Story