- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడదల రజినికి హైకోర్టు బిగ్ షాక్.. కేసు నమోదుకు ఆదేశాలు
మాజీ మంత్రి విడదల రజినికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది..

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini)కి హైకోర్టు(High Court) బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు ఇద్దరు పీఏలు, సీఐపైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోటి అనే వ్యక్తి పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం... 2 వారాల్లో కేసు నమోదు చేయాలని పల్నాడు పోలీసులను ఆదేశించింది.
కాగా 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున విడుదల రజిని చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం మంత్రి పదవిని చేపట్టారు. అయితే కోటి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తనను వేధింపులకు గురి చేశారని కోటి అప్పటి నుంచి ఆరోపించారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కోటి తరపున వాదనలు విన్న ధర్మాసనం విడదల రజినిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Next Story






