కావలి ఎమ్మెల్యేపై అధిష్టానం సీరియస్: పిలుపు.. భేటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-04 11:27:21  IST  )

కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో అధిష్టానం భేటీ అయింది. ..

కావలి ఎమ్మెల్యేపై అధిష్టానం సీరియస్: పిలుపు.. భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి(Kavali MLA Kavya Krishna Reddy)తో అధిష్టానం భేటీ అయింది. కావలి(Kavali)లో జరిగిన ఘటనపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేకు అధిష్టానం పిలుపునిచ్చింది. కావలిలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని సూచించింది. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఈ రోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. కావలిలో జరిగి పరిణామాలపై ఆయన వివరణ ఇచ్చారు.

కాగా టీడీపీ(Tdp) సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కర్మ క్రతువులుఅక్టోబర్ 30న జరిగాయి. అయితే ఈ కార్యమానికి కావ్య కృష్ణారెడ్డి వెళ్లారు. ఈ సమయంలో మాలేపాటి వర్గీయులు కావ్య కృష్ణారెడ్డిని అడ్బుకున్నారు. గతంలో సుబ్బానాయుడిని కావ్య కృష్ణారెడ్డి ఇబ్బందులు గురి చేశారని మండిపడ్డారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. దీంతో కావ్య కృష్ణారెడ్డిపై కావలి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయి వివరణ ఇచ్చారు.

READ MORE ....

క్రమ శిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికపూడి.. నివేదిక రూపంలో వివరణ

Next Story