రెయిన్ ఎఫెక్ట్: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-04 04:31:16  IST  )

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై పడింది....

రెయిన్ ఎఫెక్ట్: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై పడింది. భారీగా వస్తున్న వరదనీటితో జలాశయాలు నిండిపోతున్నాయి. ఈ మేరకు అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. రెండు రోజుల నుంచి వరద నీరు డ్యాంలోకి వస్తూనే ఉంది. దీంతో ఇన్ ఫ్లో 18,980 క్యూసెక్కులు ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 833.90 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 53.7549 టీఎంసీలు ఉంది. ఇదిలా ఉండగా కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభంకాలేదు. దీంతో అధికారులు ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు సీడబ్ల్యూసీ శాస్త్రవేత్తల బృందం శ్రీశైలం పర్యటన కొనసాగోంది. జలాశయంపై ఈ రోజు బ్యాతమేటిక్ సర్వే చేపట్టనున్నారు. ఫంజ్ పూల్ లోతు, విస్తీర్ణం అంశాలపై సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు.

Next Story