విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |

న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది..

విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy) బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన న్యూయార్క్(New York) వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశారు. తాను న్యూయార్క్ వెళ్లాలని.. ఇందుకోసం అనుమంతించాలని విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)లో పిటిషన్ దాఖలు చేశారు. న్యూయార్క్‌లో జరగబోయే యునైటెడ్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు తాను పీఎంవో నుంచి ఎంపికయ్యాయనని, ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు అక్కడికి వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది. సిట్, మిథున్ రెడ్డి తరపున వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.

కాగా లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ సమయంలో పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేశారు. అయితే జైలు నుంచి విడుదలయిన ఆయన తన పాస్ పోర్టును రిలీజ్ చేయాలని ఇటీవల విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అనుమతించింది. దేశం విడిచి వెళ్లే సమయంలో కోర్టు అనుమతి తీసుకోవాలని సూచించింది. తాను ఈ నెల 27న న్యూయార్క్ వెళ్లాల్సిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కోరుతూ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం ఆదేశిలిచ్చే అవకాశాలున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.

Next Story